పరాకుగా ఆఫీస్ నుండి బయటకి వస్తూ బయట బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన పాంప్లేట్ ని తిరగేస్తూ అక్కడే ఆగి ఉన్న ఆటోలో డ్రైవర్ సీట్ పక్కన కూచున్నాను.ఇంకో ఇద్దరు ఎక్కిన తరువాత మెల్లగా స్టార్ట్ చేసి నడుపుతూ రెండు చేతులతోనూ ఆ పాంప్లేట్ ని పట్టుకుని చదువుతున్న నన్ను చూసి,సార్, లోన్ తీసుకోవాలంటే ముందు మీరు ప్రాణాలతో ఉండాలి కదా ఆ రాడ్ పట్టుకుని కూర్చోండి అన్నాడు.అవాక్కయిపొయి అతనివైఫు అలా చూసాను.ఇంతలో పేపాల్ కంపనీ ముందు ఒక ఉత్తర భారతీయుడు ఎక్కాడు, చక్కని ఇంగ్లీష్లో ఎక్కడికి వెళ్ళాలో కనుక్కున్నాడు.అంతటితో ఆగలేదు, ఆ ఆటొ ఎక్కిన వాళ్ళలో ఎక్కువ మంది ఉత్తర భారతీయులే కావడంతో హిందీ పాటలు పెట్టాడు.
అపుడు తిరిగి చూసాను, వెనక సీట్ వైపు ఎందుకో అనుమానం వచ్చి.అదే,సరిగ్గా అదే ఆటో.ఎపుడొ ఒకసారి అసెండాస్ కి వెల్తున్నపుడు ఎక్కాను అదే ఆటో.ఇంతకీ ఆ ఆటొ ప్రత్యేకత అంటే, వెనక సీట్ పక్కన అన్ని ప్రముఖ ఆంగ్ల మేగజీన్లు ఉన్నాయి ఆటొ ఎక్కిన వాళ్ళు మార్గ మధ్యంలో చదువుకోడానికి వీలుగాను,అంతే కాదు,తనే మొబైల్స్ కి,డిటిఎచ్ సర్వీస్ లకి ఆటొలో నుండే రీచార్జ్ కూడా చేస్తాడు.అంతేకాక మెదడు కి పదును పెట్టుకోడానికి గాను అందులోనే ఒక చిన్న ప్రశ్నాపత్రం జనరల్ నాలెడ్జ్ మీద.ప్రతి వారానికి ఆ ప్రశ్నా పత్రం మారుతూ ఉంటుంది.మనం సమాధానాలు వ్రాసి దాని మీద మన పోన్ నంబర్ రాయాలి.సరి అయిన సమాధానాలు వ్రాసిన వారి నుండి ఒకరిని ప్రతీ వారం లక్కీ డ్రా ద్వారా ఎన్నుకుని బహుమానం ప్రకటిస్తారు.
ఇంతా చూసాక కుతూహలం కొద్దీ అడిగాను తనని వివరాలన్నీ.నేను మొదట ఇవన్నీ ఏదైనా ఒక సంస్థ సౌజన్యంతో చేస్తున్నాడేమో అనుకున్నాను.కానీ, అతనితో మాట్లాడిన తరువాత తెలిసింది ఏమిటి అంటే,ఇవన్నీ తన సొంత ఖర్చులతోనే ఏర్పాటు చేసాడు అని.ఎందుకు ఇవన్నీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసమా అని అడిగాను.కాదు , కస్టమర్ సాటిస్ఫై అవడానికంటే ముందు నేను సాటిస్ఫై అవ్వాలి సార్ అని చెప్పాడు.దాదాపు నెలకు ఒక 1500 ఖర్చు పెట్టి అన్ని మేగజీన్లు కొంటాడు అంట.ప్రతీది అప్డేటెడ్ గా ఉంచుతాడు అంట.ఈ మధ్యనే 30 వేలు పెట్టి ఒక ల్యాప్టాప్ కి ఆర్డర్ ఇచ్చాడంత,ఎందుకూ అంటే ఆటో ఎక్కిన వాళ్ళు ఇంటికి వెళ్ళేలోఫు ఏదైన మెయిల్స్ చెక్ చేసుకోడానికి, క్రికెట్ స్కోర్ తెలుసుకోడానికి అని చెఫ్ఫాడు.
ఇంతేకాదు, రేపు మదర్స్ డే అని చెప్పాడు. ప్రతీ మదర్స్ డే కి 30 సంవత్సారాలు దాటిన మహిళలందరికీ తనా ఆటోలో ప్రయాణం ఉచితం అనీ, అలాగే ప్రతి ఫాదర్స్ డే కి 30 సంవత్సారాలు దాటిన పురుషులకి ఉచితం అనీ,బాలల దినోత్సవం నాడు 14 సంవత్సరాల లోపు బాల,బాలికలకు, అబ్దుల్ కలాం పుట్టీన రోజు నాడు అందరికీ ఉచితం అనీ గర్భిణీలకు, వృద్ధులకు ప్రతి రోజు ఉచితం అనీ చెప్పాడు.నేను మదర్స్ డే రేపు కాదని ప్రతి సంవత్సరం MAY మొదటి ఆదివారం నాడనీ చెప్పాను.
నాకు భలే ముచ్చట వేసింది,తను ఎంత వరకు చదువుకున్నదీ ఆరా తీస్తే తెలిసింది ఏమిటి అంటే 12 వరకు అని.మరి ఇంత చక్కని ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నావు అని అడిగితే ఒక స్పోకెన్ ఇంగ్లిష్ కోర్స్ లో చేరాను అని, అంతేకాక ప్రతి రోజు ఇంగ్లీష్ పేపర్ చదువుతానని చెప్పాడు.
ఒక మనిషి ప్రేరణ పొందడానికి వ్యక్తిత్వ వికాస పుస్తకాలే చదవక్కర లేదు, మన చుట్టూ ఇలాంటి ఎందరో ఉంతారు.కాస్త కళ్ళు తెరిచి చూడాలి అంతే.ఇంతా చేసి ఇతనికి వీటి వల్ల ఆదాయం పెద్దగా పెరిగిందేమీ లేదట.నిజమే, అతను ఆటో నడిపేది చెన్నై లోని OMR రోడ్ మీద.అక్కడ లెక్కకు మిక్కిలి ఆటోలు,కచ్చితంగా ఇతని ఆటో కావాని ఎక్కేవారి సంఖ్య చాలా తక్కువ.కానీ ఎందుకు ఇది అంతా అంటే ఆత్మ సంతృప్తి కోసం.
అతని పేరు అన్నాదురై, మొబైల్ నంబర్: 9884123413
అతనితో అంత సేపు మాట్లాడి దిగిన తరువాత అతని ఫోటో తీసుకుంటాను అని అడిగాను, దానికి అతను ఇచ్చిన సమాధానం ఏమిటి అంటే మిగిలిన కస్టమర్లకి ఆలస్యం ఔతుంది సార్ అని.
వావ్! ఇలాంటి వ్యక్తులని చూసినప్పుడు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. స్ఫూర్తికరమయిన టపా అండీ!
రిప్లయితొలగించండిTappa bagundhi.. nenu kuda e auto ekanu oka sari... kaka pothe nenu adagakundane photo tisesuknanu :)
రిప్లయితొలగించండివావ్! ఆయన్ని హైదరాబాద్ ఆటోవాలా సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా నియమించాలి. నెలకోసారి customer satisfaction మీద పాఠాలు చెప్పించాలి. మీరు చెప్పినవన్నీ చేస్తూవుంటే... లేని టోపీలు తీశాం ( ఆటో పెద్దమనిషికి, ఆయన్ని గుర్తించి, ప్రత్యేకంగా నలుగురితో పంచుకున్న మీకు కూడా)
రిప్లయితొలగించండిబ్లాగు ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అపద్ధం చెప్పను.... ఇందుమూలముగా యావన్మందికీ తెలియజేయడమేమనగా... నేను రాబోట్‌ను కాను, కాను, కాను. రాబోట్లనేవి మా వంశంలో ఎప్పుడూ పుట్టినట్టు దాఖలాలు లేవు.
Sd/-
Snkr
ల్యాప్టాపూ, వివిధ దినాల్లో సంబంధిత వర్గాలకు ఉచిత ప్రయాణమూ వగైరాలు.. కాస్త అతిగా అనిపిస్తోంది.
రిప్లయితొలగించండిNice one..!
రిప్లయితొలగించండిఆటోలో డ్రైవరు పక్కన పాసెంజరు కూర్చుని ప్రయాణం చేయటం చట్టవిరుధ్ధం. శ్రీఅన్నాదురైకి తెలిసే ఉండాలే.
రిప్లయితొలగించండిఅదలా ఉంచితే, శ్రీఅన్నాదురై తన ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండాలని తాపత్రయ పడటం బాగుంది.
@రసజ్ఞ: ధన్యవాదాలు, నిజంగానే స్ఫూర్తిదాయకమైన వ్యక్తిలా కనిపించాడు అండీ..
రిప్లయితొలగించండి@Divya:Thanks for comment.... :)
@SNKR:వ్యాఖ్యకు ధన్యవాదాలు...రాబోట్ ఏమిటో అర్థంకాలేదు... :-?
@శిరీష్ కుమార్:ల్యాప్టాప్ గురించి నేనూ తగు మాత్రం సలహా ఇచాను, కానీ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవండి.
@Raja malleswar:Thnks for comment...
@శ్యామలీయం:తెలుసునేమో,కానీ ఆ వచ్చే పది రూపాయలు ఎందుకు పోగొట్టుకోవాలని ఆలోచన కావొచ్చు.వ్యాఖ్యకు ధన్యవాదాలు.
శివ చలా బగుంది రా.......
రిప్లయితొలగించండినేను చాలా మంది ఆటొ డ్రైవెర్లను చూసాను ఈ వ్యక్తి కొత్తగా ఉన్నాడు.
ఈ ఆటొ లొ ఎక్కిన పది మందిలొ ఇద్దరు నీలా అలొచిస్తె ఆ వ్యక్తి ఖర్చు పెట్టిన డబ్బుకి
సరైన విలువ అని నేను అనుకుంటాను.
ఒక ఎదవని నువ్వు ఎదవ అని చెప్పక పొయీనా తప్పులేదు,కాని ఒక మంచి మనిషికి నువ్వు మంచి వాడివని నువ్వు చెసేది మంచి పని అని చెప్పాలన్నది నా ఉద్దేశం. -మల్లి
ఆ ఆటొడ్రైవరుని మా ఏరియా(పెరంగలతురు)కి కుడా పంపించు వీలైతె... :-)
తొలగించండి