అవి మేము ఇంకా కోదాడకు రాని రోజులు,అప్పుడు మా వీధిలో మా ఒక్కరి ఇంట్లో మాత్రమే టి.వి ఉండేది.చుట్టుపక్కల అమ్మలక్కలందరూ పనులు అయిపోయాక మా ఇంటికి వచ్చి సీరియల్స్ చూసే వాళ్లు.
అప్పుడు సీరియల్స్ కూడా ఇప్పటి సీరియల్స్ లా జీడిపాకం సీరియల్స్ కాదు.7:30 కి వార్తలు అయిపోయాక వచ్చి 8:30 వరకు టి.వి చూసి వెళ్ళేవారు.8:30 కి ధారావాహిక కార్యక్రమాలు అయిపోయాక తరువాతి రోజు వచ్చే కార్యక్రమాల గురించి చెప్పేవారు.అలా ఒకరోజు అందరూ వెళ్ళిపోతున్న సమయంలో రేపటి నుండి రాత్రి 8:00 గంటలకు వెన్నెల్లో అడపిల్ల ధారావాహిక కార్యక్రమం అని వెసారు,అది చూడగానె నాన్న "అబ్బ!చాలా మంచి సీరియల్" అని అన్నాడు.అంతే అమ్మలక్కందరూ రేపటి నుండి ఆ సీరియల్ చూసితీరుతామని ప్రతిన బూని వెళ్ళారు.
అప్పటికి నేను ఏ రెండో తరగతో చదువుతూ ఉండొచ్చు.అప్పుడు నాకు ప్రేమ కథలు అంతగా నచ్చేవి కాదు.ఆ వయసు వాళ్ళకి ఎవరికీ నచ్చవనుకుంటా.అందుకే నేను అంతగా పట్టించుకోలేదు,నా మట్టుకు నాకు ఆదివారం పూట వచ్చ్చే శ్రీకృష్ణ అంటే చచ్చేంత పిచ్చి.అందులో యుద్ధాలు గట్రా చూడడం అంటే మహ సరదా.
వెన్నెల్లో ఆడపిల్లా ఏ రోజు వచ్చేదో కూడ సరిగా గురుతు లెదు,కాని అది వచ్చె రోజు ఇళ్ళు ఒక జాతర అయేది.కొన్ని రోజులకే చిత్రలహరి లాంటి పాపులర్ కార్యక్రమాన్ని డామినేట్ చేసేసింది.( ఇది నేను ఆ రెండు రోజులూ మా ఇంటికి వచ్చే జనాభాని బట్టి వేసిన చిత్తు లెక్క మాత్రమే ).
నాకు చాలా బోల్డు హాశ్చెర్యం వెసేది ఆ అభిమాన గణాన్ని చూస్తే.అలా అలా గడుస్తూ ఇప్పటి సీరియల్స్ లా కాకుండా ఆ సీరియల్ క్లైమాక్స్ కి వచ్చేసింది.రేపు చివరి భాగం అనగానే ఆ రోజు ఎపిసోడ్ న మిస్ అవకూడదని అందరూ తీర్మానించుకుని తరువాత రోజు టంఛనుగా వచ్చి వాలాయి అభిమాన చకోరాలు.
నాకు కూడా అంత మంది జన సందొహాన్ని చూసే సరికి కుతూహలం కాస్త పెరిగింది.నేను కూడ చూద్దామనికూర్చున్నాను టి.వి ముందు.లీలగా క్లైమాక్స్ గురుతుంది చివరకు గులాబి పూల దండలోంచి హీరోయిన్ చేయిని చూపిస్తారు,ఆ చెతికి ఒక ఉంగరం ఉంటుంది.హీరో ఆ అమ్మాయి శవాన్ని చూడ కుండానే వెనుదిరుగుతాడు.
నాకు అప్పుదు అంత బాగా నచ్చలేదు కానీ,మా ఇంటికి వచ్చిన ప్రేక్షక మహాశయులంతా కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ ఒకరిని ఒకళ్ళు ఓదార్చుకుంటూ ఏదో విధి అనీ,కలికాలం అనీ నొచ్చుకుంటూ బాధా తప్త హృదయాలతో వెళ్ళిపోయారు.
****************************************************************
కట్ చేస్తే
****************************************************************
2006వ సంవత్సరం.నేను మా బాబాయి వాళ్ళ ఇంటికి వెళితే నాకు "విజయానికి అయిదు మెట్లు" పుస్తకం ఇచ్చి చదవమన్నాడు.దానికి పబ్లిషర్ రాసిన ముందు మాటలో ఒక పాయింట్లో అప్పటిలో వెన్నెల్లో ఆడపిల్ల విడుదల అయిన మొదటి రోజే కాపీలన్నీ అమ్ముడయ్యాయి అని రాసాడు.
అప్పుడు మొదటి సారి నాకు ఆ నవల చదవాలని అనిపించింది.ఎలా?ఎక్కడ దొరుకుతుంది?తెలియదు.అసలు తెలూ నవలలు ఇప్పటికీ అమ్ముతునారన్న విషయం కూడా తెలియదు.ఎలగైనా చదవాలని అనుకున్నాను.అలా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నవల చదవకుండానే అయిపోయింది.
రెండో సంవత్సరం ఇంటర్ సెమిష్టర్ హాలిడేస్ కూడా వచ్చాయి కాల క్రమంలో.అలా మళ్ళీ ఒక రోజు మా బాబాయి ఇంట్లో పుస్తకాలదొంతరలో వెతుకుతుంటే అపుడు నా కళ్ళ బడింది ఆ పుస్తకం. చప్పున తీస్కుని బయటపడ్డాను. ఆ రాత్రి ఎలాగైనా పూర్తి చేసేయాలి అని డిసైడ్ అయిపోయాను.
ఆ రోజు రాత్రి
అన్ని పనులూ,అన్నం తినడం వగైరా వగైరా అన్నీ త్వర త్వరగా పూర్తి చేసి 8:00 గంటలకు పుస్తకం పట్టుకుని కొర్చున్నాను.నేను కొన్ని పేజీలు మాత్రమే తిపాను,తరువాతంతా పుస్తకమే నా చెత మిగతా పేజీలన్నీ చదివించింది.అసలు చదువుతున్నంత సేపూ నేను నాలో లేను.ఆ కథ జరుగుతున్న ప్రదేశంలో వాళ్ళ మధ్య ఇరుక్కుపోయాను.
అసలు అలాంటి ఆలోచన ఎలా వచ్చింది యండమూరికి అని హాశ్చెర పడిపోయేను.ఎంత బాగా రాసాడంటే,అసలు అమ్మాయి అంటే
రమ్య మాత్రమే అనిపించేలా ఉంటుంది.ఆ అమ్మాయి తెలివితేటలూ,ఒక చదరంగ గ్రాండ్ మాస్టర్ ని ఒక చిలిపి అమ్మాయి ఆట పట్టించిన విధానం.యండమూరి ప్రతి ఒక్క పాత్రకీ ఒక వ్యక్తిత్వాన్ని సృష్టిస్తాడు.ప్రతో పాత్రా ఆకట్టుకుంటుంది,ముఖ్యంగా జేంస్ పాత్ర.
నవల చివరి 30 పెజీలు చదౌవుతున్నంత సేపు నా చేతి గోర్లన్నీ పళ్ళ దాడికి బలైపోయాయి.ఒక అంతర్జాతీయ స్థాయి ఆటగాడు తను వలచిన అమ్మాయి కోసం ఆట ఓడిపోయినా కోఓడా పర్వాలెదనుకుని,ఒక క్లూ దొరకగానే చిన్న పిల్లాడిలా పరుగు పరుగున వెళ్ళి రమ్య అడ్రస్ కనుక్కోవడం చాలా బాగా రాసాడు.
ఇందులో బాగా ఆకట్టుకునే ఇంకో విషయం రమ్య,రెవంత్ కి రాసే నాలుగు లేఖలు.అందులోనూ చివరి లేఖ కళ్ళ నీళ్ళు తెప్పిస్తుంది.
ఆఖరుకి చాలా హృద్యంగా ముగిస్తాడు.
అప్పుడు అర్థం అయింది నాకు,చిన్నప్పుడు అమ్మలక్కందరూ ఎందుకు ఏడ్చారోఈ.చదివాక నేను ఏడ్చాను.
అసలు ఎంతలా ఫీల్ అయ్యానంటే,రమ్య చనిపోయిన తరువాత రేవంత్ మానసిక పరిస్థితి వివరిస్తూ నేనే ఒక రచన చేయాలన్నంత.
బరువుగా బాధపడి,దాన్నుండి తెరుకుని టైం చూద్దును కదా 3:00 అయింది.
ఇక నిద్రకు ఉపక్రమిద్దామనుకుని మంచం ఎక్కాను.కష్టంగా కలత నిద్రలోకి జారుకునాను.ఆ రాత్రి నిద్ర సరిగా పట్టలేదు.
ఎలాగైనా ఈ నవలని మినిమం నలగురి చేత చదువించాలనుకున్నాను.హాలిడేస్ అయిపోగానే పుస్తకం కాలేజ్ కి తీసుకు వెళ్ళాను.మా ఫ్రెండ్స్ కొంతమందికి ఇచ్చాను చదవమని,చదివాక అందరిది ఒకే మాట "నిద్ర పట్టడం లేదు బాసూ!".
పట్టినా పీడకలలు, ప్రేమించిన అమ్మాయి చనిపోతే అని.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మరి ఆ నవల మహత్యం అది....
రిప్లయితొలగించండినిజంగానే చాలా మంచి నవల. నేను ఇంటర్మీడియట్ లో ఉండగా చదివాను. మీ టపా టైటిల్ మాత్రం భలే ఉంది
రిప్లయితొలగించండినేను నా ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో చదివినట్టు గుర్తు. నేను కూడా ఒకేసారి చదివాను పుస్తకం అంతా.
రిప్లయితొలగించండిYour blog is interesting.
రిప్లయితొలగించండి@padmarpita:బాగా చెప్పారండి,తరువాత నేను యండమూరి అభిమానిని అయిపోయాను.
రిప్లయితొలగించండి@kiranmayi:ధన్యవాదాలండీ.
@abhedyudu:ధన్యవాదాలండీ,మీ కవితా శక్తి కూడా బాగుంది.
@praveena:Thank you.
అబ్బో ఈ నవల చదివి నేను కనీసం వారం రోజులు పడుకోలేదు.. పైగా చాలామందికి చెప్పి చదివించి ఎడిపించేసాను :)
రిప్లయితొలగించండివిశ్వనాథ్ గారూ...,
రిప్లయితొలగించండినమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
Good post Keep it up:)..First time Iam into ur blog.
రిప్లయితొలగించండి