ఈ మధ్య చాలా బ్లాగులలో కులాల గురించి కుమ్ములాటలు జరూతున్నాయి.నేను బ్లాగులొకంలోకి వచ్చి కొంతకాలమే అయింది, అయినా కులాల మీద నా అభిప్రాయం కూడా చెపుతాను. ఇది నేను నా తర్కంతో ఆలోచించినది. అందరూ దీనిని సమర్ధిస్తారని నేను అనుకోను కానీ చాల కొంత మంది విమర్శిస్తారని మాత్రం అని అనుకుంటున్నాను.
అసలు మానవజాతి పరిణామ క్రమంలో ఈ కులాలు.మతాలు వచ్చి చేరి చాలా కొద్ది కాలం అయిందని నా అభిప్రాయం.చాల మంది కుల వృత్తులు అంటారు కానీ,నన్ను అడిగితే అది వృత్తి కులాలు .అంటే ఏదో ఒక వృత్తి చేసుకుని బ్రతికే తెగలు అని .
మొదటిలో మానవులంతా ఇలా వృత్తుల పరంగా వివిధ వర్గాలుగా విడిపోయి,ఎవరి జీవనోపాధి వారు చూసుకుని ఉంటారు.ఆ కమ్యూనిటీనే తరువాత కులం అయి ఉండొచ్చు. అందులో డిమాండ్ ఉన్న వృత్తి చేసిన వారు లేదా ఎక్కువ మంది ప్రజలు ఏ వృత్తి అయితే చేసే వారో, వారు ఆర్ధికంగా కొంచెం బలంగా ఉండడం మూలాన అగ్ర కులాలు అయి ఉంటారు.
ఒక కులం వారంతా ఒకే పని చేస్తారు కాబట్టి,వివాహ సమయంలో అదే కులం వచ్చిన అమ్మాయి లేదా అబ్బాయి అయితే ఆ పని మీద కొంచెం అవగాహన ఉంటుందని,అది వారు ఆర్ధికంగా ఎదగడానికి ఉపయోగపడవచ్చుననో ,పనిలో చేదోడువాదోడుగా ఉంటుందనో ఒకె కులానికి చెందిన వారంతా అదే కులానికి చెందిన వారిని వివాహం చేసుకోవడం మొదలు పెట్టి ఉండొచ్చు. అదే తరువాత పెరిగి వటవృక్షం అయి ఇపుడు కులాల పేరు మీద కుమ్ములాటలు జరిగే స్థాయికి చేరింది.
ఇక కులాంతర వివాహాల విషయానికి వస్తే రెందు వేరు వేరు కులాలకి చెందిన వారు వివాహం చేసుకోవద్దు అని అనడం మూర్ఖత్వం.రెండు వేరు,వేరు కులాల వారు వివాహం చేసుకోవద్దు అంటే రెండు వేరు,వేరు వృత్తుల వారు కూడా వివాహం చేసుకోవద్దు.ఒక బ్యాంకు ఉద్యోగి,మరొక బ్యాంకు ఉద్యోగిని మాత్రమే చేసుకోవాలనడం ఎంత అవివేకమో,కులాంతర వివాహాన్ని వ్యతిరేకించడం కూడా అంతే అవివేకం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Kevvu keka Viswanaath Gaaru . Please join telugukingdom.net
రిప్లయితొలగించండిWell said.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికులాల గురించి నీ విశ్లేషణ బాగుంది. కానీ, కులాంతర వివాహాల మీద చివ రనిచ్చిన వ్యాఖ్యలతో ఏకీభవించను.
రిప్లయితొలగించండి"రెందు వేరు వేరు కులాలకి చెందిన వారు వివాహం చేసుకోవద్దు అని అనడం మూర్ఖత్వం" - ఇది మూర్ఖత్వం ఎందుకవుతుంది. ప్రేమ పెళ్ళిళ్ళలో ఇద్దరి అభిరుచులు కలవడం లేదా పరస్పర అవగాహన ఉండచ్చు. కానీ పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలొ (ఇవే ఎక్కువుంటాయి మన దేశంలో) ఇది వివేకం అయ్యినా కాకపొయినా లౌక్యం అవుతుంది. ఒకే కులపువారైతే పెరిగిన విధానం (తద్వార దంపతులిద్దరి ఆలోచనలు), ఆహారపు అలవాట్లు మొదలగునవి సరిపోతాయి. ఎలాగైతే ఒక ప్రాంతం వారు ఇంకో ప్రాంతం వారిని పెళ్ళి చేసుకోవడానికిష్టపడరో (నాకు తెలిసి గుంటూరు నించి హైదరాబాదు వెళ్ళి రెండు దశాబ్దాల క్రితమే స్థిరపడి వారి అబ్బయి/అమ్మాయి కి హైదరాబాదు కాకుండా , కేవలం గుంటూరు , కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోనే సంబంధాలు వెతికేవారు కోకొల్లలు), రెండు విభిన్న వాతావరణములోంచి వచ్చినవారు ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే మన దేశంలో పెళ్ళి రెందు మనుషుల (మనసుల) మధ్యనే గాకా రెండు కుటుంబాల మధ్యనకూడగనక .
"ఒక బ్యాంకు ఉద్యోగి,మరొక బ్యాంకు ఉద్యోగిని మాత్రమే చేసుకోవాలనడం ఎంత అవివేకమో" - ఇది కూడా అవివేకమెందుకౌతుంది? ఇది వరకటి రోజుల్లో ఉపాధ్యులు, ప్రభుత్వోద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, ఈ కాలంలో సాఫ్ట్వేరు వారు, అప్పుడూ ఇప్పుడూ డాక్టర్లు వారి వారి రంగంలోని వారినే పెళ్ళి చేస్కోవడం సాధారణం కదా! ఒకే రంగంలో ఉంటే బదిలీలు తేలిక; వృత్తిలోని సాధకబాధలు తెలుసు గనుక ఒకరినొకరు అర్ధం చెస్కోవచ్చు; ఇంకా డాక్టర్లు కలసి నర్సింగ్‌హోంలు పెట్టుకోవచ్చు (నీవు పైన చెప్పిన వృత్తికులాల ఆధారంగానే).
Hope Viswanath would marry a banjara women and live peacefully. :)
రిప్లయితొలగించండిJB's views make sense.
@జేబి
రిప్లయితొలగించండిముందుగా వ్యాఖ్యకు ధన్యవాదములు.
నేను చెప్పింది ఒక బ్యాంకు ఉద్యోగి మరొక బ్యాంకు ఉద్యోగిని పెళ్ళి "చేసుకోవాలనుకోవడం" గురించి కాదు.
ఒక బ్యాంకు ఉద్యోగి మరొక బ్యాంకు ఉదోగినే పెళ్ళి "చేసుకోవాలనడం" గురించి.
చేసుకోవాలనుకోవడం,చేసుకోవాలనడం వేరు,వేరు అని నా అభిప్రాయం.
@snkr
బంజారా వాళ్ళు మాత్రం అమ్మాయిలు కాదా?వాళ్ళు పెళ్ళికి పనికిరారా?
లాజిక్ బాగుంది.
రిప్లయితొలగించండికాని లాస్ట్ పేరా నీ లాజిక్ కి వ్యతిరేఖంగా ఉంది.
కులాంతర వివాహాలు చేసుకోవడం అభ్యంతరకరం కాదు. కానీ ఆ వివాహాలు చేసుకున్న తరువాత ప్రస్తుత సమాజంలో కావాలని చేస్తున్నట్లుగా కొన్ని ఇబ్బందులెదుర్కోవాల్సి వస్తోంది. పిల్లలకు ఏ కులం వర్తిస్తుందో దగ్గర నేను చాలా ఇబ్బందులెదుర్కొన్నాను. ఆర్థికంగా ఇబ్బందిలేని వారికి ఈ ఒడిదుడుకులు తెలీవు. కానీ ఈ వివాహం చేసుకున్నారంటే ఇది కూడా తప్పదు. నా అనుభవపూర్వకంగా చెపుతున్నా. అలా అని మా ఇంట్లో ఎవరూ చేసుకోవడం మానలేదు. అందరివీ ప్రేమ వివాహాలే, కులాంతర వివాహాలే. దీనిపై నేను సమగ్రంగా ఒక పోస్టు రాయాలనుకుంటున్న నా అనుభవాలతో..
రిప్లయితొలగించండి