9, ఆగస్టు 2010, సోమవారం

ఎందుకిలా?

ఉద్యోగం వచ్చేంత వరకూ ఎవరైనా నన్ను, ఏం చేస్తున్నావు బాబూ అని అడిగితే, ఇంజనీరింగ్ అయిపొయింది అని చెప్పడానికి చాలా భయపడేవాడిని.ఎందుకంతే వెంటనె ఒక అనుబంధ ప్రశ్న అడుగేవారు,అవునా మరి future plans ఏమిటి అని.నేను సమాధానం ఏమీ చెప్పేవాడిని కాదు.ఎందుకంటే నాకే తెలియదు,నా ప్రణాళిక ఏమిటో.కానీ నిన్న మొట్టమొదటిసారి నేను ఇంజనీరింగ్ చేసాను అని,నేను ఒక ఇంజనీర్ని అని చెప్పుకోవడానికి "సిగ్గుపడ్డాను".

ఉద్యోగంలో చేరి రెండు వారాలు అయింది.ట్రైనింగ్ కూడా పూర్తి స్థాయిలో మొదలవకపోవడంతో, ట్రైనింగ్ కి అవసరమైన పుస్తకాలు కొందామని అనుకుంటున తరునంలో,మా స్నేహితుడు ఒకడు "ఒరేయ్ మా స్నేహితుడొకడు "IIT,MADRAS" లో చదువుతున్నాడు.వాడి దగ్గరకి వెళ్ళి మనకు కావలసిన పుస్తకాలు తెచ్చుకుందాము అని సలహా ఇచ్చాడు.దానితో అందరంIIT,MADRAS కి బయలుదేరాము.గేటు దాటి లోపలకు అడుగుపెట్టాగానే కళ్ళు బైర్లు కమ్మాయి.ఎటు చూసినా చెట్లు,జింకలు,పచ్చదనం.అక్కడే క్యాంపస్ బస్ ఎక్కి నర్మద హాస్టల్ కి చేరుకున్నాము.అక్కడ పరిచయ,పలహార కార్యక్రమాలు పూర్తి అయ్యాక మా వాడి స్నెహితుడు అక్కడ స్ట్యూడెంట్స్ చేసిన ప్రాజెక్ట్స్ వీడియోస్ చూపించాడు.అవి చూస్తుంటే ఒక్కసారిగా నేను కరిక్యులంలో భాగంగా చేసిన ప్రాజెక్ట్ గుర్తుకు వచ్చింది.

ఆ ప్రాజెక్ట్స్ ఎక్కడ,మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ స్ట్యూడెంట్స్ చేసే ప్రాజెక్ట్స్ ఎక్కడ?అవి కూడా వాళ్ళు కరిక్యులంలో భాగంగా చేసిన ప్రాజెక్ట్స్ కావు.వాళ్ళ సొంత ఆసక్తితో చేసినవి.అవి కూడా చిన్న,చిన్న లాజిక్స్ మీద ఆధారపడినవి.చాలా చిన్న లాజిక్ మీద ఆధారపడినవి.ఉదాహరణకి నేను చూసిన వాటిలో "self balancing bicycle"అనే ఒక ప్రాజెక్ట్ ఉంది.దానిని మనం మన హ్యూమన్ ఫోర్స్ ఉపయొగించి తొక్కనవసరంలేదు.దాని మీద కూర్చుంటే అదే మనల్ని తీసుకుని వెల్తుంది.అది ఎలా చేసారు బాసూ అని అడిగితే దాని లాజిక్ చెప్పాడు,మనం సైకిల్ తొక్కుతున్నపుడు, బ్యాలన్సింగ్ కోసం హ్యాండిల్ ఆటు,ఇటు కొంచెం తిప్పుతుంటాము.అదేపనిని ఇక్కడ ఒక మోటర్ చేస్తుంది.మనం సైకిల్ తొక్కము కాబట్టి,అది నడవడానికి,వెనక టైర్ కి ఉన్న ఫ్రీవీల్ కి ఒక మోటర్ అమర్చాము,అది వెనక టైర్ ని తిప్పుతుంది.దీని స్పీడ్ కి తగ్గట్టు,హ్యాండిల్ మూమెంట్ని దానికి అమర్చిన మోటర్ నియంత్రిస్తుంది.


చెప్పడానికి చాల చిన్న లాజిక్కే,కానీ దానిని పనిచేయించడానికి వాళ్ళు ఎంత కశ్టపడ్డారో చెపుతుంటే,మళ్ళి నాకు మేము చేసిన ప్రాజెక్ట్ గుర్తుకువచ్చింది.కొన్న ప్రాజెక్ట్కి ఒక చిన్న మాడిఫికేషన్ చేయమని మా H.O.D అంటే అది చేయలేక నానా చావు చచ్చాం.

చాలా ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రాజెక్ట్ కోసం బయటికి పంపిస్తారు.అది స్ట్యూడెంట్స్ కి ఒక లీజర్ పీరియడ్.ప్రాజెక్ట్ అనగానే,అందరూ రెక్కలు కట్టుకుని అమీర్పేటలో వాలిపోవడం.తలా ఒక 500 వేసుకుని,ఒక చక్కని (అలా అని ఇన్స్టిట్యూట్ వాడు చెపుతాడు) ప్రాజెక్ట్ కొనొక్కుని వారనికి ఒకటి లేదా రెండు క్లాసులకు అటెండ్ అవుతూ,జల్సా చేయడం.అందరూ ఇలానే అని కాదు,కొందరు మాత్రమే ఇలా కాకుండా వారానికి మూడు రోజులు క్లాస్ కి అటెండ్ అవుతుంటారు. మొత్తానికి డాక్యుమెంటేషన్,చివరికి పొవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా వాడి దగ్గరే తీసుకుని దానిని కాలేజీలో ప్రెజెంట్ చేయడం.ఎలాగూ అక్కడ ఉండేది మన సినియర్లే(కాకపోతే వీళ్ళని లెక్చరర్లు అని పిలుస్తారు) కాబట్టి, ఎవొడూ ఏమీ అడగడు.అలా 200 కి 198 మార్కులు తెచ్చుకుని ఇంజనీరింగ్ పట్టాలో చూసుకుని మురిసిపోతుంటాము.

వాళ్ళకి,మనకి ఎందుకు ఆ తేడా?మన రాష్ట్రంలో దాదాపు 700 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి.వాటిలో ఎన్నంటిలో ఇలాంటి ఆవిష్కరణలు జరుగుతున్నాయి.అడపా,దడపా విజ్ఞాన్,వరంగల్ లోని ఒకటి,రెండు కాలేజీలని,అక్కడ,ఇక్కడాకొన్ని కాలేజీలని మినహాయిస్తే,ఎక్కడ మన ఇంజనీరింగ్ ప్రదర్శించేది.

అసలు దీనికి కారణం ఏమిటి? మా క్లాస్ లోని 60 మంది స్ట్యూడెంట్స్ కి, ఒక కొత్త కంప్యూటర్ ని విడి,విడి భాగాలుగా ఇచ్చి,కనెక్ట్ చేయమంటే చేయలేని వాళ్ళు కూడా ఉంటారు(అతిశయోక్తి ఏ మాత్రమూ కాదు ).విధ్యార్థులలో ఏదైనా చేదామనే ఉత్సాహం ఉండదు,ఉత్సాహం ఉన్న వాడికి ప్రోత్సహం ఉండదు.కనీసం అసలు టెక్నాలజీ ఎలా ఉంది బయట ప్రపంచంలో దాని వాడుక ఎంతవరకూ అంటె ఏ ఇంజనీరింగ్ విధ్యార్థి చెప్పడు.

కరిక్యులంలో భాగంగా టెక్నికల్ సెమినార్ ఇవ్వవలిసి వస్తే,మా కాలేజీ నుండి ప్రతిఒక్కరూ అంతకు ముందు వడో ఇచ్చిన సెమినార్ని మల్లీ చెప్పడమే(నేనూ అతీతుడిని కాదు).
ఎందుకు మన ఇంజనీరింగ కాలేజీలు ఇలా తగలబడ్డాయి.కనీసంsimple past tense లో ఒక వాక్యాన్ని సరిగ frame చేయలేని వాళ్ళు కూడ,లెక్చరర్లుగా ఉన్నంత కాలం మన ఇంజనీరింగ్ విధ్యార్థులు నేను ఇంజనీర్ ని అని గర్వంగా చెప్పుకోలేరు.

5 కామెంట్‌లు:

  1. you are right. Every parent want to see their childern as engineers in AP.

    రిప్లయితొలగించండి
  2. నీ ఆవేదన సరైనదేగానీ ఆ చివరి వాక్యంతో ఎకీభవంచలేను. లెక్చరర్లకి ఇంగ్లీషు రావలసినవసరం లేదు. ఇంకొకటి, వారు స్కూలు పిల్లలకి చెప్పినట్లు పుస్తకంలోవన్నీ మొత్తం తరగతిగదిలో చెప్పనక్కరలేదు. వారు కేవలం మార్గదర్శకులు మాత్రమే.

    - ఏడేళ్ళు ఐ.టీ.లో ఉన్నా నన్ను నేను ఇంజనీరని అనుకోను.

    - 'విధ్యార్థి ' కాదు : విద్యార్థి - బహుశా టైపో అనుకుంటా.

    రిప్లయితొలగించండి
  3. వ్యాఖ్యకి ధన్యవాదములు,
    ఇంజనీరింగ్ అనేది professional course.
    కాబట్టి లెక్చరర్లు ఇడియంస్ వాడాల్సిన అవసరం లేదు,కనీసం మామూలు ఆంగ్లంలోనైనా తప్పులు లేకుండా మాట్లాడగలగాలి కదా!

    రిప్లయితొలగించండి
  4. I am not sure what I am missing?

    >>దాని మీద కూర్చుంటే అదే మనల్ని తీసుకుని వెల్తుంది ?? >>
    ఎలా ???
    అసలు సైకిల్ ని , దానిమీద కూర్చున్నవాడిని తీసుకెళ్ళడానికి కావల్సిన శక్తి ని ఎవరు ఉత్పత్తి చెస్తారు ??

    రిప్లయితొలగించండి